బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

NRML: సోన్ మండల కేంద్రంలో కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి, బాలల హక్కుల రక్షణకై చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం అందించాలని కౌన్సిలర్ సుప్రియ వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంపోలి వనజ, ఉప సర్పంచ్ రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.