గన్నవరంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

గన్నవరంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

కృష్ణా: గన్నవరం అర్బన్ పోలీస్ స్టేషన్‌ ఎస్సైఐ ముస్తాబాద గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత నిబంధనలు, అలాగే దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో అనుమానస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పుకొచ్చారు.