'ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలి'
MHBD: 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వెంకటేశ్వర బజార్‌లో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ వైద్యుల సేవల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అందుబాటులో ఉన్న వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తోందన్నారు.