కొరియర్ కేంద్రంలో విజిలెన్స్ అధికారుల దాడి

SRPT: మేళ్లచెరువులో కొరియర్ కేంద్రంలో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలో ఓ కొరియర్ కేంద్రంలో బేయర్ సంస్థకు చెందిన పిచికారి మందులు అనుమతి లేకుండా సరఫరా చేసినట్లు వారు గుర్తించారు. కొరియర్ కేంద్రంలో లభ్యమైన రూ.30 లక్షల విలువ చేసే బేయర్ మందులను అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.