'రోడ్డు సమస్యను ప్రస్తావించాలని ఎమ్మెల్యేకు వినతి'

'రోడ్డు సమస్యను ప్రస్తావించాలని ఎమ్మెల్యేకు వినతి'

ADB: బజార్ హత్నూర్ మండలంలోని మోర్ఖండి గ్రామస్తులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గ్రామంలోని ప్రధాన సమస్య అయిన బరంపూర్ మోర్ఖండి రోడ్డు అటవీ అనుమతులపై ప్రస్తావించాలని అనిల్ జాదవ్‌ను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.