ఎంఐఎం నాయకుల సంబరాలు
NZB: బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం 5 సీట్లు గెలుచుకున్న సందర్భంగా బోధన్ పట్టణంలోని ఎంఐఎం కార్యాలయంలో శనివారం నాయకులు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మీర్ ఇలియస్ అలీ, ప్రధాన కార్యదర్శి హమీద్, అక్తర్ తదితరులున్నారు.