ఓవర్ లోడ్ తో లారీలను తిప్పితే కఠిన చర్యలు

AKP: ఓవర్ లోడ్‌తో లారీలను తిప్పితే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డీఎస్పీ పీ.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం తిరిగే లారీలకు చెందిన ట్రాన్స్ పోర్టు లారీ అసోసియేషన్ యాజమానులతో సమావేశమయ్యారు. తాళ్లపాలెం బ్రిడ్జి ధ్వంసం అవుతున్న కారణంగా 40 టన్నుల కంటే అధిక లోడుతో వాహనాలు వెళ్లరాదన్నారు.