టేకుచెట్లు మాయం దర్యాప్తు చేపట్టిన అధికారులు

తూ.గో: రంపచోడవరం అటవీ ప్రాంతంలో అజ్ఞాత వ్యక్తులు సుమారు 400 టేకుచెట్లను కొట్టి తరలించుకుపోయారు. వీటి విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో అటవీశాఖ అధికారుల ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.