ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

NZB: ఆలూర్ మండల కేంద్రంలో గురువారం సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి సుభాష్ యూత్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర ఉద్యమంలో చంద్రబోస్ పోరాటాలను గుర్తుచేశారు. ఆయన ఆశ సాధనకు కృషి చేస్తామని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు నవీన్, రాము, సతీష్, పవన్ తదితరులు ఉన్నారు.