'నీ వాహనం వేగంగా వెళ్తుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది'
NLG: రోడ్డు ప్రమాదాల నివారణకై జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద “నీ వాహనం వేగంగా వెళ్తుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది” అనే నినాదంతో యాక్సిడెంట్ కారును ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని పేర్కొన్నారు.