చిట్యాలలో యూరియా కొరతపై రైతు సంఘం ధర్నా

BHPL: చిట్యాల మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో యూరియా కొరతను నివారించి తక్షణం రైతులకు సరిపడా యూరియాను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ గురువారం ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం యూరియా ఉత్పత్తిని 9 శాతం తగ్గించడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు.