వంతాడపల్లిలో 'పొలం పిలుస్తోంది'
ASR: మొంథా తుఫాన్ అనంతరం వరి పంటలో తాలు గింజలు (చొప్ప గింజలు)అక్కడక్కడా కనిపిస్తున్నాయని జీకేవీధి ఏవో డీ.గిరిబాబు తెలిపారు. వీటి నివారణకు ప్రొఫినోఫాస్ మందు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. మంగళవారం వంతాడపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్‌మా పంటకు వేపనూనె పిచికారీ చేయాలని సూచించారు. అలాగే రైతులకు రాయితీపై సైకిల్ వీడార్లును అందిస్తున్నామన్నారు.