జిల్లా వ్యాప్తంగా దంచి కొట్టిన వర్షం .. నీట మునిగిన పొలాలు

SRPT: సూర్యాపేట జిల్లా నాగారంలో 19 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. జాజిరెడ్డిగూడెం, నూతనకల్, అడ్డగూడూరు, మోత్కూరు ప్రాంతాల్లో భారీ వర్షం పడ్డది. తుంగతుర్తి మండలంలో సంగెంవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో, నూతనకల్, జాజిరెడ్డిగూడెం మధ్య రవాణా నిలిచిపోయింది.తూర్పుగూడెం గ్రామంలో ఇళ్లలో వరదనీరు చేరి, వరిపొలాలు నీటమునిగాయి.