బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్ష తేదీలు విడుదల

బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్ష తేదీలు విడుదల

నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ ఫస్ట్ ఇయర్ రెగ్యూలర్ (R-23) పరీక్షల టైం టేబుల్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి వచ్చే నెల జనవరి 5 వరకు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలలో శ్రద్ధగా చదవాలని పేర్కొన్నారు.