డిప్యూటీ సీఎంపై ఎంపీ మిథున్‌రెడ్డి ఫైర్
CTR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి 'X' వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎర్రచందనం విషయంపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు గుర్తున్నాయా అని ప్రశ్నించారు. హెలికాప్టర్ నుంచి ఆయన చూపించిన భూమి తమ చట్టబద్దమైన సొత్తు అని.. ఆ భూమిని 2000లలో కొనుగోలు చేశామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.