పెద్దగట్టు పరిసరాల్లో ‘కోళ్ల’ కంపు!
SRPT: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెద్దగట్టు సమీపంలోని దురాజ్‌పల్లిలో కోళ్ల ఫారాల కాలుష్యం కోరలు చాస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జనవాసాల మధ్య నిర్వహిస్తున్న ఫారాల వల్ల వెలువడుతున్న దుర్వాసనతో స్థానికులు నరకం చూస్తున్నారు. తాజాగా చనిపోయిన కోళ్లను సమీపంలోని చెరువులో పడేస్తుండటంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.