సైబర్ మోసం.. రూ.32 లక్షలు స్వాహా..!

సైబర్ మోసం.. రూ.32 లక్షలు స్వాహా..!

నెల్లూరులో ఓ డాక్టర్ భారీగా మోసపోయారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని మాగుంట లే అవుట్లో ఉంటున్న డాక్టర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వాట్సాప్ గ్రూపులో యాడ్ చేశారు. పెట్టుబడులు పెడితే మంచి ఆదాయాలు వస్తాయని నమ్మించారు. వారి మాటలు నమ్మి ఆయన రూ. 32,60,778 నగదు పంపి మోసపోయారు. దీంతో చేసేది ఏమి లేక పోలీసులను ఆశ్రయించారు.