ఇంటిపై దాడి.. న్యాయవాది హత్య
AP: అన్నమయ్య జిల్లా కేవీపల్లి మం. వడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఎల్లయ్య అనే న్యాయవాది ఇంటిపై అర్ధరాత్రి బంధువులే రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఎల్లయ్య మరణించగా.. అతని తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు పీలేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాత కక్షలే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.