నెట్‌వర్క్ ఉన్నా.. 'నో ఇంటర్నెట్'!

నెట్‌వర్క్ ఉన్నా.. 'నో ఇంటర్నెట్'!

మైక్రోసాఫ్ట్ విండోస్ 11 కొత్త అప్‌డేట్ వల్ల లక్షలాది మంది యూజర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నెట్ ఉన్నప్పటికీ వన్‌డ్రైవ్, ఆఫీస్ వంటి యాప్‌లలో 'నో ఇంటర్నెట్' అనే ఎర్రర్ వస్తోంది. దీంతో చాలా మంది యూజర్లు లాగిన్ అవ్వలేకపోతున్నారు. ఈ బగ్‌ను గుర్తించిన మైక్రోసాఫ్ట్, త్వరలోనే శాశ్వత పరిష్కారం కోసం కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తామని తెలిపింది.