'వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి'
SRPT: వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ తుంగతుర్తిలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలతో రైతాంగం అన్ని విధాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.