VIDEO: 'జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఆనందదాయకం'
KKD: యువగళం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉగాది పండుగ సందర్భంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఆనందదాయకమని Ex.MLA వర్మ పేర్కొన్నారు. పిఠాపురం TDP ఆఫీస్‌లో వర్మ ఆధ్వర్యంలో పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఉగాది పచ్చడిని, స్వీట్లను కార్యకర్తలకు, నాయకులకు అందజేశారు.