పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించాలి: కలెక్టర్

శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను పాటించి జిల్లా రైతులు అధిక దిగుబడులు పొందాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం త్రిపురారం మండలం కంపాసాగర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో పత్తి ప్రధాన పంటగా ఉందని అన్నారు.