ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా జరగాలి: ఎంపీ
E.G: విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై రాష్ట్ర స్థాయి కార్యశాలలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియపై సమగ్ర అవగాహన, పౌరుడు ఓటరు జాబితాలో చేరేలా చేయడం, తప్పులు సవరణ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా జరగాలని సూచించారు.