VIDEO: కురబలకోట మండలంలో వింత ఘటన

VIDEO: కురబలకోట మండలంలో వింత ఘటన

అన్నమయ్య: ఇవాళ కురబలకోట మండలంలోని ముదివేడు మోడల్ స్కూల్ సమీపంలో ఒక వేప చెట్టు నుంచి తెల్లని పాలు లాంటి ద్రవం కారడం స్థానికంగా కలకలం రేపింది. ఈ వింత ఘటనతో ఆశ్చర్యపోయిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు దీనిని దైవ సంకేతంగా భావించి, అరిష్టం జరగకుండా శాంతి పూజలు నిర్వహించారు. ఈ సంఘటన ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది.