గ్యాస్ పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు

గ్యాస్ పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు

సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ కొరతలేదని, ఎవరైనా కొరత సృష్టించి పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్యాస్ నిల్వలు 15% అదనంగా ఉంచుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.