తండాలో నాటు సారా తయారీ!
NGKL: ఇటీవల వచ్చిన వరదలకు అచ్చంపేట మండల పరిధిలోని మార్లపాడు తండా ముంపునకు గురైన విషయం తెలిసిందే. అక్కడ గత మూడు రోజుల నుంచి ఆర్అండ్ ఆర్ ప్యాకేజీపై సర్వే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గిరిజనులు నాటు సారా తయారీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అచ్చంపేట తహసీల్దార్ సైదులు వారిని ఘాటుగా హెచ్చరించి, తయారైన సారా, ముడి సరుకును ధ్వంసం చేశారు.