భారీ వర్షం.. నిలిచిపోయిన రాకపోకలు

ATP: తాడిపత్రి మండలంలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా తాడిపత్రి ప్రాంతంలో 130 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు బుగ్గ వద్ద రహదారి కొట్టుకుపోవడంతో తాడిపత్రి నుంచి నంద్యాల జిల్లాలోకి రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.