వీరభద్రుని దర్శించుకున్న సహస్ర అవదాని మోడసాని మోహన్.

కడప: పూర్వపు అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్, సహస్ర అవధాని డాక్టర్ మోడసాని మోహన్ శుక్రవారం పాత చిట్వేలి లో వెలసి ఉన్న శ్రీభద్రకాళి సమేత శ్రీవీరభద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పెద్దలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు మృత్యుంజయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ పెద్దలను మోడసాని అబినందించారు.