జిల్లా నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
KDP: వైశాఖ పౌర్ణమి సందర్భంగా కడప డిపో నుంచి తమిళనాడులోని అరుణాచలానికి ఈనెల 30వ తేదీన గురువారం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ నిరంజన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కడప డిపో నుంచి ఉదయం 9.30 గంటలకు, రాయచోటి బంగ్లా నుంచి ఉదయం 10.15 గంటలకు బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఇతర వివరాలకు 9966690850కు సంప్రదించవచ్చన్నారు.