శివరాత్రి బందోబస్తుపై ఎస్పీలకు ఆదేశాలు
VSP: మహాశివరాత్రి సందర్భంగా ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాల్లో శివాలయాలు, సముద్రతీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని డీఐజీ గోపినాథ్ ఎస్పీలకు ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షలో భక్తుల రద్దీ నియంత్రణ ఏర్పాట్లతో పాటు గంజాయి అక్రమ రవాణాపై దర్యాప్తు వేగవంతం చేసి, రవాణాదారులపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.