విమాన ఇంధనంగా పామాయిల్: ఎంపీ

ELR: గిట్టుబాటు ధర కోసం ఇబ్బందులు పడుతున్న పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభవార్త చెప్పారు. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో శనివారం మాట్లాడారు. విమాన ఇంధనంలో పామాయిల్ కలిపి వాడే విధంగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు విజయవంతం అయ్యాయని, వచ్చే 10-12 ఏళ్లలో విమాన ఇంధనంగా పామాయిల్ వాడే పరిస్థితిలో ఆయిల్ పామ్ టన్నుకు 50,000 అవుతుందన్నారు.