VIDEO: నకిలీ మద్యంకి తయారీకి వ్యతిరేకంగా ర్యాలీ
KDP: పులివెందుల పట్టణంలో సోమవారం నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు వైఎస్ జయమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మినీ సెక్రటేరియట్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ శ్రేణులు నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.