'రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి'
GNTR: ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ఫిరంగిపురం మండలంలోని వేములూరిపాడు గ్రామంలో శుక్రవారం రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్‌టెన్షన్ డైరెక్టర్ డా. శివన్నారాయణ, లామ్ ఫారం ప్రిన్సిపాల్ డా. వీ.శైలజ పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, సారవంతమైన నేల వ్యవసాయానికి ప్రాణాధారం అని పేర్కొన్నారు.