VIDEO: ధర్మారం రైల్వే గేట్ వద్ద రోడ్డు ప్రమాదం
WGL: గీసుకొండ మండలం ధర్మారం రైల్వే గేట్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ప్రభాకర్ అనే వ్యక్తికి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ నాగరాజు, పైలట్ సాంబయ్య ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.