మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి జైలు శిక్ష

NTR: విజయవాడ నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులు తనిఖీలలో పట్టుబడిన నలుగురికి న్యాయస్థానం వారం రోజుల జైలు శిక్ష విధించింది. మూడో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపే నలుగురిని గుర్తించారు. వారిని రైల్వే కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆర్‌వీఎస్ శర్మ వారం రోజుల జైలు శిక్ష విధించారు.