ఉంగుటూరు పరిధిలో రేపు పవర్ కట్

ఉంగుటూరు పరిధిలో రేపు పవర్ కట్

కృష్ణా: ఉంగుటూరు సబ్‌స్టేషన్ పరిధిలోని తరిగొప్పల ఫీడర్ లైన్‌లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు తుట్టగుంటపాడు, నాగవరప్పాడు, వెన్నోతల, వెల్దిపాడు, తరిగొప్పల, వేంపాడు గ్రామాల్లో విద్యుత్ ఉండదని వెల్లడించారు. ఈ సమయంలో వినియోగదారులు సహకరించాలని కోరారు.