మత్తుమందు చల్లి చోరీకి యత్నించిన దుండగులు

ATP: గుమ్మగట్ట మండలం పులకుంటలో గంగారెడ్డి దంపతుల ఇంట్లో ఇవాళ తెల్లవారుజామున చోరీ జరిగింది. నిద్రిస్తున్న సమయంలో మత్తుమందు చల్లి ఇద్దరు దుండగులు బీరువాలోని రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు,రూ. 2 లక్షల నగదును అపహరించారు. చైన్ లాగినపుడు మెలుకువ రావడంతో భార్య ఉషారాణి అరవడంతో దొంగలు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.