VIDEO: కోతులు చేసిన పనికి రోడ్డున పడ్డ కుటుంబం..!

WGL: కోతులు చేసిన పనికి ఓకుటుంబం సర్వస్వం కోల్పోయి రోడ్డున పడింది. పర్వతగిరి మండలం నారాయణపురానికి చెందిన బుచ్చిరాములు దంపతులు కూలీ పనులకు వెళ్లారు. ఈ మేరకు కోతుల గుంపు స్తంభంపై ఉన్న విద్యుత్ వైర్లను గట్టిగా ఊపడంతో నిప్పు రవ్వలు ఎగిసి గుడిసెపై పడ్డాయి. దీంతో అగ్నిప్రమాదం జరిగి వస్తువులన్నీ దగ్ధం కాగా, కట్టుబట్టలతో మిగలమని సోమవారం బాధితులు వాపోయారు.