'దేవాలయాల అభివృద్ధికి సహకరించాలి'
అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, టీటీడీ జేఈవో వెంకటయ్య చౌదరిని కోరారు. ఆదివారం తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌసులో TTD దేవస్థాన జేఈవో వెంకటయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మేమెంటోను బహూకరించారు.