శాంతియుతంగా వినాయక చవితి జరుపుకోవాలి: పల్నాడు ఎస్పీ

పల్నాడు: జిల్లా ప్రజలందరూ వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలన్నారు.