రేపు ప్రజావాణి రద్దు...ప్రజలు కలెక్టరేట్‌కు రావొద్దు

BDK: భద్రాద్రి జిల్లా ప్రజలకు కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రుగొండ మండలం బెండలపాడులో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులందరూ ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఈనెల 18న సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.