VIDEO: మంత్రులు ఫోన్ ఎత్తకపోవడంపై పోచారం బాధ
KMR:ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, మంత్రులు తన ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంపై బాధ కలిగిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి ఎవరూ ఫోన్ చేసినా ఎత్తేవాడినని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కొందరు స్పందించకపోవడం తనను నొప్పించిందని, అభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.