సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

KNR: సామాజిక సమానత్వానికి కృషిచేసిన సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు .సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి నివాళులర్పించారు.