చెత్త రికార్డును సమం చేసిన హార్దిక్ పాండ్యా

IPLలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ చెత్త రికార్డును సమం చేశాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్‌లో ఏకంగా 11 బంతులు వేశాడు. దీంతో IPL చరిత్రలో ఓ ఓవర్‌లో 11 బంతులు వేసిన ఐదో బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. హార్దిక్‌కు ముందు సిరాజ్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, శార్దూల్ ఠాకూర్ ఈ చెత్త ప్రదర్శన చేశారు.