వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కరపత్రాలు ఆవిష్కరణ

వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కరపత్రాలు ఆవిష్కరణ

కృష్ణా: పెడన మార్కెట్ యార్డ్‌లో ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర (MSP) కరపత్రికను మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అనంతలక్ష్మీ ఇవాళ విడుదల చేశారు. రైతులకు లభించే మద్దతు ధరలు, కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కరపత్రికలో పొందపరిచారన్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న MSP పథకాలను సద్వినియోగం చేసుకుని లాభాలు పొందాలని సూచించారు.