ఎంపీపీగా 'రాజాన'ప్రమాణ స్వీకారం
AKP: ఎలమంచిలి ఎంపీపీగా రాజాన సూర్య చంద్ర శేషగిరిరావు సోమవారం స్థానిక మండలం పరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన పార్టీకి చెందిన శేషగిరిరావు ప్రస్తుతం వైస్ ఎంపీపీగా ఉన్నారు. గత నెలలో ఎంపీపీ బోదెపు గోవిందపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో శేషగిరిరావుని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పాల్గొన్నారు.