ఈ నెల 20న తిరుమలకు రాష్ట్రపతి ముర్ము
TPT: భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ నెల నవంబర్ 21న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా, నవంబర్ 21న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత తిరుమలకు చేరుకుంటారు. నవంబర్ 20న ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకుని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోనున్నారు.