జిల్లా ప్రజలను వణికిస్తున్న చలి
RR: గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. దీంతో నగరంలో చలి తీవ్రత అధికంగా పెరుగుతోంది. ఈ క్రమంలో జిల్లాలోని రాజేంద్రనగర్‌లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నగర వాసులను చలి వణికిస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.