'ప్రమాదాలు లేకుండా దీపావళి జరుపుకోవాలి'
KKD: దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి ప్రమాద సంఘటనలు చోటు చేసుకోకుండా సురక్షితమైన వాతావరణంలో దీపావళి జరుపుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను కోరారు. శనివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.