నాణ్యమైన విత్తనం..రైతన్నకు నేస్తం కార్యక్రమం
JGL: రాయికల్ మండలంలోని అల్లీపూర్, సింగర్రావు పేట గ్రామాల్లో బుధవారం పొలాస వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు స్పందన, స్వాతి, ఏఈఓ సతీశ్ రైతులకు వరి, పసుపు పంటల సాగులో మెలకువలు, చీడపీడల నివారణ గురించి అవగాహన కల్పించారు.